ice los angeles

లాస్ ఏంజలెస్ అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. ఇది అమెరికా సం…
లాస్ ఏంజలెస్ అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల లో న్యూయార్క్ తరువాత అత్యధిక జనాభా కలిగిన పెద్ద నగరం. పడమటి తీర నగరాలలో ఇది అతి పెద్దది. ఎల్.ఎ.సంక్షిప్త నామము కలిగిన ఈ పట్టణం ప్రపంచ నరరాలలో ఆల్ఫా నగరంగా గుర్తించబడింది. ఈ నగరం 469.1 చదరపు మైళ్ళ విస్తీర్ణము కల్గి 2006 నాటి అంచనా ప్రకారము 38,49,368 జనసంఖ్యను కల్గి ఉంది. కాలిఫోర్నియా దక్షిణ ప్రాంతంలో పసిఫిక్‌ మహాసముదపు తీరాన ఉన్న ఈ నగరం మధ్యధరా ప్రాంతపు శీతోష్ణస్థితిని కల్గి ఉంటుంది. గ్రేటర్ లాస్ ఏంజలెస్ అనబడే నగరపాలిత ప్రాంతమైన లాస్ ఏంజలెస్, లాంగ్ బీచ్, శాంటా అన్నా ప్రాంతములో ఒక కోటీ ముప్పది లక్షల మంది నివాసము ఉంటారు. ప్రపంచము నలుమూలల నుండి వచ్చి చేరిన ఇక్కడి ప్రజలు సుమారు నూరు విభిన్న భాషల వరకు మాట్లాడుతుంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల లోనే పెద్ద జిల్లాఅయిన లాస్ ఏంజలెస్ జిల్లాకు ఈ నగరం కేంద్రము. ఏంజలాన్స్ అనబడే పూర్వీకులు ఇక్కడ నివసించినట్లు గుర్తించారు. ఈ నగరానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యమున్న ముద్దుపేరు సిటీ ఆఫ్ ఏంజల్స్.

సూచిత యాత్రా ప్రణాళికలు

దీనిలోని డేటా: te.wikipedia.org